How the employee have leaves in year?

ఉద్యోగులకు ఏడాదికి 21 క్యా జువల్‌ లీవులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అదనపు సీఎల్‌ వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఉద్యోగుల ఫండమెంటల్‌ రూల్స్‌ 85లో నాలుగో నిబంధనను సవరించారు. దీని ప్రకారం రక్తదానం చేసే ఉ ద్యోగులు ఆ సర్టిఫికెట్‌తో రెండు రోజులు సెలవు తీసుకోవచ్చు. పురు ష ఉద్యోగులు వేసక్టమీ చేయించుకుంటే ఆరు రోజులు సెలవు వాడుకోవచ్చు. ఉద్యోగి భార్య ట్యూబెక్టమీ చేయించుకుంటే ఆ ఉద్యోగి ఏడు రోజులు సెలవు వినియోగించుకోవచ్చు. మహిళా ఉద్యో గులు ట్యూబెక్టమీ చేయించుకుంటే 14 రోజులు సెలవు తీసుకోవచ్చు. గర్భంలో పిండం చనిపోతే 14 రోజులు, పుట్టిన బిడ్డ పురిటిలోనే చనిపోతే 21 రోజులు సెలవు తీసుకోవచ్చు. వీటిని సాధారణ సెలవులతో సంబంధం లేకుండా వాడుకోవచ్చు.

Read More